ఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి శ్రీకారం

అమరావతి

ఆరోగ్యశ్రీలో మరో నూతన శకానికి శ్రీకారం
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి (గురువారం) నుంచి 6 జిల్లాలకు విస్తరణ
క్యాంపు కార్యాలయంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్
మొత్తంగా 2200 వైద్య ప్రక్రియలకు ఆరోగ్య శ్రీ
గతంలో 1059 వైద్య ప్రక్రియలే, అవీ అరకొరగానే
నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బకాయిలు పెట్టిన గత ప్రభుత్వం
గత ప్రభుత్వ బకాయిలను అన్నింటినీ తీర్చిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం
గత ఏడాది జూన్‌ నుంచి రూ.1,815 కోట్లు చెల్లింపు
ఉద్యోగుల ఆరోగ్య పథకంలో మరో రూ.315 కోట్లు
వైద్యులు సూచించిన కొత్త 87 వైద్య సేవలకూ పథకం

అమరావతి:

నిరుపేదలకు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్య సేవలందించే వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో మరో నూతన శకం ఆరంభం అవుతోంది. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తూ, గురువారం నుంచి మరో ఆరు జిల్లాలకు పథకాన్ని విస్తరిస్తున్నారు. విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, వైయస్సార్‌ కడప, కర్నూలు జిల్లాలలో గురువారం నుంచి దీన్ని అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.

మరో హామీ అమలు:
వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని ఎన్నికల ప్రణాళికలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తున్నారు.

పైలట్‌ ప్రాజెక్టు:
ఆరోగ్యశ్రీ పథకంలో సమూల మార్పులు చేస్తూ, తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టును ఈ ఏడాది జనవరి 3 నుంచి అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో అప్పటి వరకు ఉన్న 1,059 వైద్య ప్రక్రియలకు, మరో వేయి వైద్య ప్రక్రియలను పెంచి 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింప చేశారు. పైలట్‌ ప్రాజెక్టులో గమనించిన అనేక అంశాలకు అనుగుణంగా పథకంలో మార్పులు చేస్తూ, ఇప్పుడు మరింత  పటిష్టంగా ఆరోగ్యశ్రీ అమలు చేసేలా విధానాలు రూపొందించారు.

పెరిగిన వైద్య ప్రక్రియలు:
పథకంలో వైద్య ప్రక్రియలను 2,059 నుంచి 2,146కి పెంచారు. సంపూర్ణ క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా మరో 54 వైద్య ప్రక్రియలను కూడా పథకంలో చేర్చారు. దీంతో ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం అందించే వైద్య ప్రక్రియల సంఖ్య మొత్తం 2,200కు చేరింది.

గత ప్రభుత్వ హయాంలో!:
కాగా, గత ప్రభుత్వ హయాంలో కేవలం 1,059 వైద్య ప్రక్రియలకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింప చేసేవారు. అది కూడా అరకొరగా అమలు చేశారు. మరోవైపు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో, అవి పథకంలో చికిత్సకు నిరాకరించాయి.

ఈ ప్రభుత్వ హయాంలో..:
ఆరోగ్యశ్రీ పథకం దుస్థితిని చూసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, దీనిపై దృష్టి పెట్టి పరిస్థితి పూర్తిగా మార్చారు. నెట్‌వర్క్‌  ఆస్పత్రులకు పథకంలో బకాయిలు చెల్లించడంతో పాటు, ఆయా ఆస్పత్రులలో నాణ్యమైన వైద్య సేవలకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గత ఏడాది జూన్‌ నుంచి రూ.1,815 కోట్లతో పాటు, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)లో మరో రూ.315 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.

కొత్తగా చేర్చిన కొన్ని వైద్య ప్రక్రియలు:
ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా చేర్చిన 1000 వైద్య ప్రక్రియలు నిజంగా ప్రజలకు ఒక వరంగా మారుతున్నాయి. వాటిలో కొన్ని డే కేర్‌ చికిత్సలు (ఒక్క రోజు ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందడం) కూడా ఉన్నాయి.
ఉదాహరణకు:
రక్తహీనత, తేలు కాటు, వాంతులు మరియు డీహైడ్రేషన్, రక్త విరేచనాలు, స్వల్పకాలిక చికిత్సలు.
వీటితో పాటు ఇంకా:
మూర్ఛ వ్యాధి, డెంగీ జ్వరం, చికున్‌ గున్యా, వడ దెబ్బ, ఆస్తమా వంటి ఐ.పీ. చికిత్సలు కూడా కొత్తగా పథకంలో చేర్చారు.
పలువురు వైద్య నిపుణులు సూచించిన 87 కొత్త వైద్య ప్రక్రియలను కూడా ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకువచ్చారు.

మిగిలిన జిల్లాలలో..:
ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేస్తుండగా, గురువారం నుంచి మరో ఆరు జిల్లాలలో కొత్త ఆరోగ్యశ్రీ పథకం అమలు కానుంది. ఈ నేపథ్యంలో మిగిలిన 6 జిల్లాలలో కూడా ఈ ఏడాది నవంబరు 14వ తేదీ నుంచి పథకం అమలు చేయనున్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget