సంజీవిని మొబైల్ వాహనం ద్వారా జరుగుతున్న కరోనా పరీక్షలను పరిశీలించిన శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి,

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంజీవిని మొబైల్ వాహనం ద్వారా జరుగుతున్న  కరోనా పరీక్షలను పరిశీలించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

సంజీవిని వాహన డ్రైవర్లను, సహాయకులను శాలువాలతో సత్కరించి, ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే కాకాణి.లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పొదలకూరు మండలంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం.
జగన్మోహన్ రెడ్డి గారు సంజీవిని మొబైల్ వాహనాలను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.కరోనా పరీక్షలు చేయించుకోవాలనుకుంటే వారి కోసం సంజీవిని బస్సును ఏర్పాటు చేయడంతో పాటు, ఇతర ప్రదేశాలలో కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఇబ్బందులు కలగకుండా, వైద్యం మరియు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం.సర్వేపల్లి నియోజకవర్గ ప్రాంతంలోని ప్రజలెవ్వరూ ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.కరోనా వచ్చిన వారికి ఇంట్లోనే ఉండి వైద్యం చేయించుకునేలా డాక్టర్లు సూచనలు సలహాలు అందిస్తున్నారు.ఇంట్లో ఉండి ఇబ్బందులు పడే వారిని మాత్రం కోవిడ్ సెంటర్లకు పంపి వైద్యం అందిస్తున్నారు.నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు  200 పడకలతో కోవిడ్ సెంటర్ తో పాటు, ప్రతి మండలంలో క్వారంటైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాము.పగలనక, రాత్రనక విధులు నిర్వహిస్తున్న సంజీవిని బస్సు డ్రైవర్లకు, సహాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget