"నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు" పథకంపై అధికారులతో..సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల రెవిన్యూ కార్యాలయంలో "నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు" పథకంపై అధికారులతో సమీక్షించి, ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,

సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

స్క్రోలింగ్ పాయింట్స్:

👉జగన్మోహన్ రెడ్డి గారు మునుపు ఎన్నడూ లేని  విధంగా  నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పధకం కింద, ఇళ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది.

👉జూలై 8వ తేది ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలనుకున్నా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు  ఆగస్టు15న ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు.

👉గత ప్రభుత్వాలు పేదలకు పట్టాలు ఇచ్చారు తప్ప భూములు ఎక్కడున్నాయో చూపించక అవస్థల పాలు చేశారు.

👉వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతం మాదిరి జరగ కూడదని భూములను గుర్తించి లేఅవుట్లు వేసి, వాటిని అభివృద్ధి చేసి అర్హులైన పేదలకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు.

👉 రాష్ట్ర ప్రజల సొంతింటి కలను తీర్చాలని పేదలందరికీ ఇళ్ల పధకం కింద ఇళ్ల స్థలాల పంపిణీ చేపడితే, చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్లి ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కాని పరిస్థితి.

👉జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు తెలుగుదేశం నాయకులు నానా అవస్థలు పడుతున్నారు.

👉నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని అధికారులకు సూచించాం.

👉అనర్హులుగా ఉన్న వారి పేర్లు తొలగించి, అర్హులకు న్యాయం చేయడం జరుగుతుంది.

👉బడాబాబులు ఆక్రమించిన భూములను వెనక్కి తీసుకునేందుకు చర్యలు చేపడితే, గతంలో  మంత్రులుగా పనిచేసిన వారు విమర్శల దాడికి దిగుతున్నారు.

👉ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఆగస్టు 15వ తేదీ నాడు అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తాము.

👉గతంలో అధికారం వెలగబెట్టిన వారి మాటలు కోటలు దాటాయి తప్ప, చేతలు గడపలు దాటలేదు.

👉సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీను నిలబెట్టుకుంటాను.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget