రైతులు 200 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగాసంఘీభావం తెలుపుతూ TDP నాయకులుమాజీ శాసనసభ్యులు పాశిం.సునీల్ కుమార్

గూడూరు పట్టణం : ప్రజా రాజధాని అమరావతి కోసం అమరావతి నందు ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని అనే నినాదంతో  రైతులు 200 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు వారికి సంఘీభావం తెలుపుతూ TDP నాయకులు కార్యకర్తలతో కలసి మహా దీక్ష చేపట్టిన.... పాశిం.సునీల్ కుమార్
 మాజీ శాసనసభ్యులు
 గూడూరు నియోజకవర్గం.

అమరావతి  లోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 200 రోజులకు చేరుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 66 మంది రైతులకు నివాళులు అర్పించారు.

అనతరం మీడియాతో మాట్లాడుతూ..

👉200 రోజుల నుండి నిరసనలు చేస్తున్న రాష్ట్ర  ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది.

👉అమరావతి రాజధానికి దేశచరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా ల్యాండ్ ఫూలింగ్ ద్వారా 34 వేల ఎకరాలను ఇచ్చిన 29 వేల మంది  రైతుల త్యాగాన్ని కూడా లెక్క చేయకుండా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కు నిరసనగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు , ప్రజలు చేస్తున్న నిరసన్ దీక్షలకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలియచేస్తూ ఉన్నదని అన్నారు.

👉మాజీ ముఖ్యమంత్రి నారా.చంద్రబాబునాయుడు గారు విజన్ తో అలోచించి అమరావతి అయితేనే అన్నివిధాల బావుంటుందని రాష్ట్ర రాజధాని కోసం ప్రధాన మంత్రి మోడీ గారి చేతుల మీదుగా భూమి పూజ చేయించి ప్రారంభించారు.

👉ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నపుడు అమరావతి రాజధానిగా ఉండటానికి మేము వ్యతిరేకం కాదు, మా పూర్తి మద్దతు అమరావతికే తెలియజేస్తున్నాం అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం జరిగింది.

👉అలాగే 2019 ఎన్నికల ప్రచారంలో రాజధాని అమరావతినే కొనసాగిస్తాం అని , రాజధాని ఇక్కడనుండి ఎక్కడికి తరలించం అని అమరావతి ప్రాంత ప్రజలకు భరోసా ఇచ్చి , గెలిచి ముఖ్యమంత్రి అయిన తరువాత అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కులాలను అంట గట్టి కేవలం మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా.చంద్రబాబునాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టి మీద ద్వేషంతో కక్ష సాధింపుతో 72% పనులు పూర్తి అయిన అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానుల ప్రకటన చేసి విశాఖపట్నం ను రాజధానిగా కొనసాగించాలని అనుకోవడం ఏరుదాటాకా తెప్ప తగలేయడం లాగా రాజధాని రైతులను రోడ్ల పాలు చేయడం దారుణం అన్నారు.

👉ప్రస్తుతం రాజధాని విషయం శాసన మండలిలో ఆగి సెలెక్ట్ కమిటీ కి వెళ్ళడం రాజధాని వ్యవహారం కోర్ట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న గాని రాజధానిని మార్చాలనుకోవడం చూస్తుంటే ఈ ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థల మీద ఏ మాత్రం గౌరవం నమ్మకం లేదన్నారు.

👉రాజధాని ప్రాంతంలో అన్ని కులాల వారు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారని, అన్ని కులాల వారు మీకు ఓట్లు వేసి గెలిపించారని , కాని మీరు మాత్రం ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ భూములు ఇచ్చిన రైతులందరినీ తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం చాలా దారుణం అన్నారు.

👉200 రోజులుగా పట్టు వదలని విక్రమార్కులు వలే 66 మంది రైతులు రాజధాని ఉద్యమంలో ఆశువులు బాసినా గాని, ఉద్యమం చేస్తున్న రైతుల వద్దకు కనీసం ఆ ప్రాంత MLA లు గాని , మంత్రులు గాని వెళ్లి వారి సాధక,బాధకాలు తెలుసుకునే ప్రయత్నం నేటి వరకు చేయకపోగ, ఉద్యమం చేస్తున్న రైతులపై లాటిచార్జ్ చేయించడం, అక్రమ SC/ST కేసులు బనాయించి వేదించడం చాలా హేయమని అన్నారు.

👉ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రజా వ్యతిరేక కక్ష సాధింపు కార్యక్రమాలు పక్కన పెట్టి, కులమత ప్రాంతీయ విబెధలాను రెచ్చ గొట్టకుండా, భూములు ఇచ్చిన రైతులందరికీ న్యాయం చేయాలని, ఆంద్ర రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి నే ప్రకటించాలని డిమాండ్ చేసారు.
             
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అద్యక్షులు పులిమి.శ్రీనివాసులు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బిల్లు.చెంచు రామయ్య, పట్టణ కార్యదర్శి నరసింహులు, మాజీ కౌన్సిలర్లు తాతపూడి.ఇశ్రాయేల్ కుమార్,ముక్కస.శశిధర్, కోట మండల పార్టీ మాజీ అద్యక్షుడు పాదర్తి.కోటా రెడ్డి, చిల్లకూరు మండల ZPTC అభ్యర్ధి చిరంజీవి, TDP నాయకులు నరసింహులు నాయుడు, గురవయ్య పిల్లెల.శ్రీనివాసులు,అలీబాషా,కొణతం.సురేష్,జహంగీర్, సురేంద్ర, చంద్ర మౌళి, రవి, శ్రీనివాసులు, తెలుగు యువత నాయకులు ప్రనీత్ యాదవ్,దయాకర్, శ్రీకాంత్  మరియు TNSF నాయకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget