ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మాతృ వియోగం

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి సరళమ్మ (70సం) అనారోగ్యంతో బాధపడుతూ నెల్లూరు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతిచెందారు.  ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సొంత గ్రామమైన సంగం మండలం పడమటి పాలెంలోని నివాసానికి ఆమె పార్థివదేహాన్ని తీసుకువచ్చారు. పలువురు ప్రముఖులు ఆమె పార్ధివ దేహానికి నివాళులర్పించారు. విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తో పాటు, వైసీపీ నాయకుడు రూప్ కుమార్ యాదవ్ ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే కోటంరెడ్డి తో పాటు ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి లను పరామర్శించారు. సరళమ్మ మరణవార్త  తెలుసుకున్న స్థానిక ప్రజలు, వైసిపి నాయకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget