హైవేలపై బస్సులు, ట్రక్కులను ఆపొద్దు........

హైవేలపై బస్సులు, ట్రక్కులను ఆపొద్దు........

*రాత్రిపూట ప్యాసింజర్లను అడ్డుకోవద్దు

*రాత్రి 9 నుంచి కర్ఫ్యూ మాత్రం యథాతథం

*రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ తాజా సూచనలు

న్యూఢిల్లీ: ప్రస్తుతం కొనసాగుతున్న ‘అన్ లాక్ 1’ పీరియడ్ లో ప్రతిరోజూ రాత్రి 9 నుంచి తెల్లవారు జామున 5 వరకు ప్రజలు తిరగడంపై నిషేధం యథావిధిగా కొనసాగుతుందని శుక్రవారం కేంద్ర హోం శాఖ వెల్లడించింది. హైవేలపై ప్యాసింజర్లతో బస్సులు, గూడ్స్ తో ట్రక్కులు తిరిగేందుకు ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దని తెలిపింది. జనం గుమిగూడకుండా, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించేలా చూసేందుకే ప్రధానంగా రాత్రి పూట కర్ఫ్యూ విధించినట్లు కేంద్ర హోం శాఖ సెక్రటరీ అజయ్ భల్లా ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, యూటీలకు రాసిన లేఖలో క్లారిటీ ఇచ్చారు. అత్యవసరమైన పనులకు మాత్రం కర్ఫ్యూ వర్తించదన్నారు. నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల సప్లై చైన్ ఆగిపోకుండా చూసేందుకు ట్రక్కులను అనుమతించినట్లు తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో రాత్రి 9 నుంచి ఉదయం 5 మధ్య హైవేలపై ప్రజలు, వాహనాల రాకపోకలపై ఆంక్షలు పెడుతున్నట్లు తెలిసిందని, దీనివల్ల సజావుగా రాకపోకలు జరిగేందుకు ఆటంకం కలుగుతుందన్నారు.

సరుకుల లోడింగ్, అన్ లోడింగ్, స్టేట్, నేషనల్ హైవేలపై ప్యాసింజర్లతో వెళ్లే బస్సులు, ట్రక్కులు, గూడ్స్ క్యారియర్లు, బస్సుల నుంచి దిగి గమ్యస్థానాలకు వెళుతున్న వ్యక్తులు, ట్రెయిన్స్, ఫ్లైట్స్ కు కర్ఫ్యూ ఆంక్షలు వర్తించవని అజయ్ భల్లా వివరించారు. ఇలాంటి రాకపోకలను అడ్డుకోరాదని రాష్ట్రాలు, యూటీలకు సూచించారు. ఈ విషయంపై జిల్లా, లోకల్ ఆఫీసర్లకు ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పారు. ప్రస్తుతం దేశంలో కంటైన్ మెంట్ జోన్లలో మాత్రమే లాక్ డౌన్ కొనసాగుతోంది. మిగతా అన్ని ప్రాంతాల్లో ‘అన్ లాక్ 1’ గైడ్ లైన్స్ అమలవుతున్నాయి

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget