ఆకాశంలో ఆదివారం ఓ అద్భుతమైన ఘట్టం జరగనుంది

ఆకాశంలో ఆదివారం ఓ అద్భుతమైన ఘట్టం జరగనుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సైంటిస్ట్ రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 నుంచి మధ్యాహ్నం 3.04 వరకు ఈ సూర్య గ్రహణం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ గ్రహనం సమయంలో సూర్యుడు పూర్తిగా వలయాకారంలో (రింగ్స్ ఆఫ్ ఫైర్)గా ఏర్పడనుందని ఆయన తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ గ్రహణం సంపూర్ణంగా కాకుండా పాక్షికంగా ఇది కనిపించనున్నట్లు తెలిపారు. ఈ సూర్యగ్రహణ ఛాయలు ముందుగా భారతదేశంలోని గుజరాత్‌లోని ద్వారకలో దర్శనమివ్వనున్నట్లు వెల్లడించారు.

రేపు ఏర్పడే గ్రహణం కారణంగా సూర్యుడి నుంచి అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమి మీద పడతాయని ఆయన తెలిపారు. ఇక ఈ గ్రహణం ఛాయలు తెలంగాణలో సూర్యగ్రహణం సమయం ఆదివారం ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రభావంతో కరోనా 0.001 శాతం చనిపోయే అవకాశం ఉందని అంచనా వేశారు. రాష్ట్రంలో సుమారు 51 శాతం గ్రహణం చూడవచ్చని వెల్లడించారు.

ఇక ఏపీ విషయానికొస్తే గ్రహణం ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు ఉండనుంది. ఈ సమయంలో 46 శాతం సూర్యుడు కనిపిస్తుందని వివరించారు. మరోవైపు, రింగ్స్ ఆఫ్ ఫైర్ కరోనా వైరస్‌ను చంపుతుందంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని రఘునందన్ కొట్టిపారేశారు. గ్రహణాల సమయంలో వినిపించే మూఢ నమ్మకాలను ప్రజలు అసలు నమ్మవద్దని ఆయన సూచించారు. గ్రహణం సమయంలో తినకూడదని, గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదనే ప్రచారాలు వట్టి అబద్ధపు ప్రచారాలని స్పష్టం చేశారు.

ఇక ఈ గ్రహణం గురించి మరో వైపు జ్యోతిష పండితులు పలు విషయాలను వెల్లడించారు. గ్రహణ పట్టే సమయంలో, విడిచే సమయం మధ్య పగలు తీసుకునే ఆహారాన్ని తీసుకోకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. జన్మ నక్షత్రాల పరంగా మృగశిర, ఆరుధ్ర, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, పునర్వసు 1, 2, 3 పాదాల వారికి ఈ గ్రహణం కీడును కలిగించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ గ్రహణాన్ని వృషభ, మిధున రాశుల వారు చూడకుండా ఉండాలని చెపుతున్నారు.

ఇక పోతే గ్రహణం సమయంలో రాష్ట్రంలో ఉండే దేవాలయాలన్నీ మూడపడనున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకూ బాసర సరస్వతీ దేవాలయం మూతబడనుంది. విజయవాడ, తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట ఇతర ఆలయాలన్నీ కూడా మూసివేయనున్నారు. ఇక చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవాలయంలో మాత్రం ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు జరుగనున్నాయి.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget