లాక్‌డౌన్‌ ఉత్తర్వులను రద్దు చేసిన కలెక్టర్

కృష్ణా : ఈ 26 నుంచి విజయవాడలో లాక్‌డౌన్ విధించనున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులను కలెక్టర్ ఇంతియాజ్ ఉపసంహరించుకున్నారు. తదుపరి ఉత్తర్వులను జారీ చేసే వరకు లాక్‌డౌన్ ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్ మరో ప్రకటన విడుదల చేశారు. కాగా, తొలుత విజయవాడలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఈనెల 26 నుంచి వారం రోజుల పాటు విజయవాడలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఆమేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఆ ప్రకటన విడుదల చేసిన కొద్ది సేపట్లోనే ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ మరో ప్రకటన విడుదల చేశారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget