శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 21న దర్శనాలు రద్దు

 శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ నెల 21న దర్శనాలు రద్దు

శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి ఈ నెల 21వ తేదీన ఆన్‌లైన్‌ టికెట్లను జారీ చేయకుండా నిలిపివేసింది. ఈ నెల 21న సూర్యగ్రహణం కావడంతో ఆ రోజు ఆలయం మూసివేత, శుద్ధి, దర్శనాలకు సంబంధించిన వివరాలపై క్లారిటీ రానుంది.

 
తిరుమల ఆలయం
తిరుమల ఆలయం
ఈ నెల 21న శ్రీవారి దర్శనం రద్దు చేస్తూ తిరుమల ఆలయం నిర్ణయం తీసుకుంది. సూర్యగ్రహణం కారణంగా స్వామివారి ఆలయాన్ని మూతవేయనున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి ఈ నెల 21వ తేదీన ఆన్‌లైన్‌ టికెట్లను జారీ చేయకుండా నిలిపివేసింది. ఈ నెల 21న సూర్యగ్రహణం కావడంతో ఆ రోజు ఆలయం మూసివేత, శుద్ధి, దర్శనాలకు సంబంధించిన వివరాలపై క్లారిటీ రానుంది. 20న రాత్రి 8.30 గంటలకు నిర్వహించే ఏకాంత సేవ తర్వాత శ్రీవారి ఆలయాన్ని మూసివేసి 21న మధ్యాహ్నం 2.30 గంటలకు తెరవనున్నట్లు తెలుస్తోంది.
 గ్రహణం తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి భక్తుల్ని అనుమతిస్తారు. కాణిపాకం ఆలయం 20వ తేదీ రాత్రి 9:30 గంటలకు మూసివేసి తిరిగి 21వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. అదే రోజు సాయంత్రం 3:30 గంటల నుంచి 6 గంటల వరకు దర్శనానికి భక్తులకు అనుమతిని ఇస్తారు. సూర్య గ్రహణం కారణంగా ఇప్పటికే 21న శ్రీవారి దర్శన టికెట్ల జారీని రద్దు చేశారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget