19 నియంత్రణకు జిల్లా ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ సహకరించండి కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా

19 నియంత్రణకు జిల్లా ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ సహకరించండి

💐 ప్రజలందరూ బయటకు వచ్చే సమయంలో విధిగా మాస్క్ ను ధరించాలి

💐 మాస్క్ ధరించని వారి పై గ్రామ పరిధిలో రూ.50/-, పట్టణ పరిధిలో రూ.100/- జరిమానా

💐 బహిరంగ ప్రదేశాలలలో ఉమ్మి వేయడం నిషేధం

 : జిల్లా కలెక్టర్

 చిత్తూరు, జూన్ 23: ప్రజలందరూ బయటకు వచ్చే సమయంలో విధిగా మాస్క్ ను ధరించి రావాలని జిల్లా కలెక్టర్            డా. నారాయణ భరత్ గుప్తా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ – 19 కారణం గా జిల్లా ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని, బయటకు వచ్చిన సమయం లో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్క్ ను ధరించాలని, జిల్లాలో రోజు రోజుకూ కోవిడ్ – 19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ కేసుల నియంత్రణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మాస్క్ ధరించని యెడల గ్రామ పరిధిలో రూ.50/-, పట్టణ పరిధిలో రూ.100/- జరిమానా విధించబడునని, దీనితో పాటు బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయడం కూడా నిషేధించడమైనదని, అట్లు ఉమ్మి వేసిన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోబడునని తెలిపారు. ఆదేశాలను అతిక్రమించిన వారి పై ఐ పి సి సెక్షన్ 188 విపత్తుల నిర్వహణ చట్టం – 2005 నిబంధనల మేరకు శిక్షార్హులని వారి పై చర్యలు తీసుకోబడునని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.   

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget