బ్లీచింగ్ పౌడర్,కరోనా కిట్స్,108 వాహనాలు కాదేదీ స్కాం *చేజర్ల

 : కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి
r: అగ్గిపుల్ల,సబ్బుబిళ్ళ, కుక్కపిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నారు నాడు శ్రీ శ్రీ

బ్లీచింగ్ పౌడర్,కరోనా కిట్స్,108 వాహనాలు కాదేదీ  స్కాం లకు అనర్హం అని అంటున్నారు నేడు వైసీపీ నాయకులు     
*చేజర్ల
--–-------------------

ఈరోజు కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖర్ల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ

అగ్గిపుల్ల,సబ్బుబిళ్ళ,కుక్కపిల్ల కాదేదీ కవితకు అనర్హం అని ఆనాడు శ్రీ శ్రీ అన్నారు,నేడు వైసీపీ నాయకులు బ్లీచింగ్ పౌడరు, కరోనా టెస్టింగ్ కిట్లు,108 వాహనాలు ఎదికూడా స్కాం లకు అనర్హం కాదనే విధంగా ప్రతి దాంట్లో అవినీతికి పాలుపడుతున్నారు

108 వాహనాల నిర్వహణకు GVG సంస్థకు డిసెంబర్ 2020 వరకు సమయము ఉన్నప్పటికి దానిని రద్దు చేసి విజయసాయి రెడ్డి గారి బంధువుల సంస్థ అయిన అరబిందో సంస్థకు నిబంధలకు విరుద్ధంగా కట్ట బెట్టారు.

108 వాహనాల నిర్వహణ కొరకు ఒక వాహనానికి ఒక నెలకు GVG సంస్థ కు ప్రభుత్వం రూ1.31 లక్షలు చెల్లిస్తుండగా నేడు అరబిందో కు కొత్త వాహనాలకు రూ1.78 లక్షలు,పాత వాహనాలకు రూ 2.25 లక్షలు చెల్లించే విధంగా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.దీని వలన ప్రభుత్వానికి 300 కోట్లు పైగా అదనపు భారం పడుతుంది

ప్రతి అంశంలోను రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా గత ప్రభుత్వం కంటే తక్కువ ధరకే టెండర్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొనే ప్రభుత్వం 108 వాహనాలు విషయములో రివర్స్ టెండరింగ్ విధానములో ఎందుకు పోలేదో చెప్పాలి

ఈ సందర్భంగా ప్రభుత్వం అమలులో ఉన్న కాంట్రాక్టరు ను ఎందుకు ప్రక్కన పెట్టవలసి వచ్చిందో చెప్పాలి

అనుభవం ఉన్న GVG సంస్థను తొలగించి అనుభవం లేని అరబిందో ఫౌండేషన్ కు ఎందుకు అప్పగించవలసి వచ్చిందో చెప్పాలి

వైసీపీ  ఏడాది పాలనలో రాష్ట్రాన్ని కొంభకోణాలకు కేరాఫ్ అడ్రెస్సుగా మార్చారు

ఇసుకు,మట్టి,మద్యం మాపియాల మయమైనది,ప్రజల ప్రాణాలతో  ముడిపడిన  కరోనా టెస్టింగ్ కిట్లు,బ్లీచింగ్ పౌడర్ కొనాగోలులో కూడా అవినీతికి పాల్పడ్డారు.ఇప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడుతూ సేవలందిస్తున్న 108 అంబులెన్స్ ల కొనుగోలు,నిర్వహణ లో కూడా కుంభకోనాణానికి పాల్పడ్డారు

 ఈ విషయం పై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి ఇందుకు బాద్యులైన వారు ఎంత పెద్ద వారైనా వారిపై చర్యలు తీసుకొని తమ చిత్త శుద్దిని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము

 ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దారా విజయబాబు, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి,SK నాసీర్,మహమ్మద్,ఇంటూరు విజయ్,గరపాటి అనిల్,భదవరపు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget