తోడేరు గ్రామంలో "సర్వేపల్లి రైతన్న కానుక" గా ప్రజలకు ఉచితంగా బియ్యం, వంటనూనెను పంపిణీ చేసిన--శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో "సర్వేపల్లి రైతన్న కానుక" గా ప్రజలకు ఉచితంగా బియ్యం, వంటనూనెను పంపిణీ చేసిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లిశాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.

కరోనా నేపథ్యంలో  తోడేరు గ్రామంలోని అన్ని కుటుంబాలకు 15 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె శ్రీమతి పూజిత.
లాక్ డౌన్ సమయంలో  ప్రజలు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రెండు సార్లు రేషన్, ₹1,000/-ల ఆర్ధిక సహాయం ఇవ్వడంతో పాటు ఇప్పుడు మూడవ విడత రేషన్ ఇవ్వడం జరిగింది.
ఆర్థిక పరిస్థితి బాగలేక పోయినా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదవారికి అండగా నిలిచిన ఘనత  మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది.
ప్రభుత్వం ఇస్తున్న రేషన్ తో పాటు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు బియ్యం, వంటనూనెను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది.
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా మన నియోజకవర్గంలో ₹3.50 కోట్లతో రైతుల నుండి సేకరించిన విలువైన బియ్యాన్ని, నిత్యావసర సామగ్రిని పంపిణీ చేస్తున్నాము.
నియోజకవర్గంలోని రైతులకు ఇచ్చిన ఒక్క పిలుపుతో 1000 పుట్ల ధాన్యాన్ని అందజేసి,ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలిచిన ఘనత సర్వేపల్లి నియోజకవర్గ రైతులకే దక్కుతుంది.
దేశానికే మన నియోజకవర్గ రైతులు ఆదర్శంగా నిలిచారు, అందుకే ఈ కార్యక్రమాన్ని వారికి అంకితం చేస్తూ, "సర్వేపల్లి రైతన్న కానుక" పేరుతో పంపిణీ చేస్తున్నాం.
మా కుటుంబానికి ఈ గ్రామం ఎప్పుడూ అండగా నిలిచింది.
నేను రెండు సార్లు ఎమ్మెల్యే గా కావడానికి కారణం నా తండ్రి రమణారెడ్డి గారిపై మీకున్న ప్రేమాభిమానాలు.నేను, నా బిడ్డలు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే నా తండ్రి గారు వేసిన పునాదే కారణం.నా తండ్రి నుంచి నా బిడ్డల వరకు కూడా ఈగ్రామానికి అన్ని విధాలా  అండగా నిలుస్తాం.నా బిడ్డలు పూజిత, సుచిత్ర తమ స్వంత నిధులతో ఈ గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది.కానీ ఈ గ్రామంలో నన్ను  దెబ్బతీయాలని గతంలో కొందరు ఇక్కడ పర్యటించారు ఎందరినో మంత్రులుగా చూసిన గ్రామమనే విషయాన్ని గతంలో వాళ్లు తెలుసుకోలేకపోయారు.ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా, కుట్రలు పన్నినా ఈ గ్రామం మాకు కంచుకోటలా నిలిచింది. మీ ఆశీస్సులతో ఈరోజు ఈస్థాయిలో ఉన్నాము.
పేదలకు సహాయం చేయాలనే నా ఆశయానికి నా బిడ్డలు పూజిత, సుచిత్ర నాకు అండగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా.రానున్న రోజుల్లో ఈ గ్రామాల్లో  ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత నాది, నా కుటుంబ సభ్యులది.మీ ఇంటి బిడ్డను, మీకు ఎటువంటి సమస్య రాకుండా అహర్నిశలు కృషి చేస్తా.ఎమ్మెల్యే కాకాణి గారి కుమార్తె  శ్రీమతి పూజిత గారి స్క్రోలింగ్ పాయింట్స్:ఈ గ్రామం మాకు ఇళ్లులాంటిదైతే, ఈ గ్రామస్థులు మా కుటుంబ సభ్యుల్లాంటి వారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నియోజకవర్గంలోని ప్రజలకు మా నాన్నగారు చేస్తున్న సేవలు రాష్ట్రం మొత్తానికి ఆదర్శం. ఆయన ఆశయాలకు అనుగుణంగా తమవారికి అండగా నిలవాలనే లక్ష్యంతో, నేను, మా చెల్లెలు మా స్వంత నిధులతో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నాము.మా నాన్న గారి పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గ రైతులు స్పందించి, ఆయనకు 1000పుట్ల ధాన్యాన్ని అందించడం, ఆయనపై వారికి ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం. కరోనా నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రజలకు నాన్న గారు చేస్తున్న సేవా కార్యక్రమాలను విజయవంతమవ్వడానికి అండగా నిలుస్తున్న రైతులకు, సహాయ సహకారాలు అందిస్తున్న అధికారులకు, వైయస్సార్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget