ఇక కావలి లోనే తిరుపతి లడ్డు...

ఇక కావలిలోనే
తిరుపతి లడ్డు❗
-----------------------------------------
 తిరుపతి తిరుమల దేవస్థానం విక్రయించే " లడ్లు " ఇక కావలి బృందావనం  హోసింగ్ కాలనీ లో  విక్రయిస్తున్నట్లు -  కొండబిట్రగుంట దేవస్థానం చైర్మన్ , కాలనీ అధ్యక్షులు శ్రీరాం మాల్యాద్రి తెలిపారు . మంగళవారం మధ్యాహ్నం కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి చేతులమీదుగా విక్రయాలు ప్రారంభించామన్నారు . లాక్ డౌన్ కారణంగా తిరుమల దేవస్థానం మూసివేసి వుండడంతో భక్తుల వద్దకు లడ్లు తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు . మొదటి విడత ప్రయోగంగా 1000 లడ్లు తీసుకొచ్చినట్లు , మంగళవారం సాయంత్రానికే అన్నిలడ్లు భక్తులు కొనుగోలు చేసినట్లు కూడా ఆయన తెలియజేసారు . తిరుమల లడ్లు కొనుగోలుకు భక్తులు ఆసక్తి కనపరుస్తున్నారని , ఇక నిత్యం వెంకటేశ్వర స్వామి ప్రసాదం తమ కాలనీ లో భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు . లడ్లు ఎంతో తాజాగా ఉన్నాయని , ఒక్కో లడ్డు 25 - 00 రూపాయలకే విక్రయిస్తున్నామని , భక్తులపై ఎలాంటి భారము మోపే ప్రసక్తే లేదని ఆయన వెల్లడించారు .
Labels:

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget