లొక్డౌన్ లో మద్యం షాపులా...

నెల్లూరు జిల్లా కావలిలో లాక్ డౌన్ లో మద్యం షాపులు  ఓపెన్ చేసినందుకు నిరసనగా నిరాహార దీక్ష లో ఉన్నటువంటి ఐసిడిఎస్ మాజీ చైర్మన్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి గారి 12 గంటల నిరాహార దీక్షను విరమింప చేసేందుకు వచ్చిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ  ఉపాధ్యక్షురాలు తాళ్ళపాక అనురాధ గారు.

వెంటనే మద్యం షాపులు మోసేయాలి 
- ఐసిడిఎస్ రీజినల్ మాజీ చైర్ పర్సన్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి 
---------------------------------------
విపత్కర పరిస్థితులలో మద్యం షాపులను తెరచి భౌతిక దూరం పాటించకుండా ఆదాయమే పరమార్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు 12గంటల నిరాహారదీక్షను ప్రారంభించినట్లు ఐసిడిఎస్ రీజినల్ మాజీ చైర్ పర్సన్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి తెలిపారు. శనివారం ఆమె తన నివాసంలో పొదుపు మహిళలతో కలసి స్వీయ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలంతా 12 గంటల నిరాహారదీక్ష ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 45 రోజులుగా అధికారులు, పోలీసులు పడిన కష్టాన్ని గుర్తించకుండా లాభార్జనే ద్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గుడులు, బడులు, మసీదులు, చర్చిలకు, చిన్న చిన్న దుకాణాలకు లేని అనుమతులు మద్యం షాపులకు ఇవ్వడం వెనుక అంతర్యం, పరమార్ధం జె-టాక్స్ అని అందరికీ అర్థమవుతుందని తెలిపారు.  పచ్చని సంసారాలలో మద్యం చిచ్చు పెట్టి ప్రభుత్వం సరదా చూస్తుందని ఆమె ఆరోపించారు. సంపూర్ణ మధ్య నిషేధం చేసే అవకాశమున్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకుండా త్వరగా అనారోగ్యం పాలయ్యే మద్యాలను షాపులలో పెట్టి అమ్ముతున్నారని దుయ్యబట్టారు. వెంటనే మద్యం షాపులను మూసివేయాలని, ఎన్నికల మానిఫెస్టో లో చెప్పిన విధంగా సంపూర్ణ మద్యనిషేధం విధించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, గుత్తికొండ కిషోర్ బాబు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, పొట్లూరి శ్రీనివాసులు, పొదుపు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget