పోతిరెడ్డిపాడు ఆధునికరణను వ్యతిరేకించే హక్కు తెలంగాణ కి లేదు

పోతిరెడ్డిపాడు ఆధునికరణను వ్యతిరేకించే హక్కు తెలంగాణ కి లేదు...
పోతిరెడ్డిపాడు హెడ్ రేగులేటర్ నుండి ఎత్తిపోతల పధకంద్వారా నీటిని తరలించుకునే ప్రాజెక్టును వ్యతిరేకించే హక్కు తెలంగాణ ప్రభుత్వానికి లేదు.
జాతీయ,అంతర్జాతీయ నాదీ జలాలపై లోయర్ రిపెరియన్ రైట్స్ వున్నాయే కానీ అప్పర్ రేపేరియన్ రైట్స్ వుండవు. దిగువ ప్రాంతమైన రాయలసీమ ప్రాంతానికి చట్టపరమైన హక్కులు శ్రీశైలం జలాల మీద వున్నాయి.
కృష్ణ నదీ జలాల వివాదాల పరిష్కారం కొరకు ఏర్పడిన బచావత్ త్రిబ్యూనల్,బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, శ్రీశైలం నుండి సముద్రం లోకి వెళ్లే మిగులు జలాల పై సంపూర్ణ హక్కులు ఆంధ్రకు వున్నాయని తీర్పులు ఇప్పటికే ఇచ్చివున్నాయి.
జల సం''లు 15 సం"క్రితం 60రోజులుగా గత 5సం"లుగా 30రోజులుగా శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం తగ్గిపోయింది.సగటున 15రోజులు మాత్రమే రాయలసీమ,నెల్లూరు జిల్లాలు పోతిరెడ్డిపాడు నుండి నీటిని తీసుకుంటున్నాయి.
తెలంగాణ మాత్రం కర్ణాటక నుండి జూరాలకు నీరు వచ్చినవెంటనే,చట్టవ్యతిరేకంగా జూరాల నుండి పాలమూరు-రంగారెడ్డి,కల్వకుర్తి-నెట్టెంపాడు కు రోజుకు రెండు TMC లు ఎత్తిపోతల ద్వారా తరలించుకుంటున్నారు.ఈ ప్రాజెక్టులకు ఎటువంటి అనుమతులు లేవు.
తమ భూభాగంలో వుందని తమకు హక్కులు వున్నాయని ప్రపంచంలోనే అతిపెద్ద  lift irrigation scheme కాళేశ్వరం ప్రాజెక్టులో 20 లిఫ్ట్ పాయింట్ లు ,20రిజర్వాయర్లు ద్వారా 147 TMCలు తరలించుకుంటుంది.ఆంధ్రా అభ్యంతరాలు లెక్కచేయలేదు.
శ్రీశైలం జలాశయం మన భూభాగం లో వుంది. నీటి పై చట్ట బద్ధమైన హక్కులువున్నా పోతిరెడ్డిపాడు ఆధునికరణను తెలంగాణ వ్యతిరేకించడం ఆంధ్రు
ల పతనం కోరుకోవడమే.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget