కందుకూరు పాత్రికేయులకు ఆదాల విరాళం

కందుకూరు పాత్రికేయులకు
 ఆదాల 2లక్షల విరాళం 


నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన నియోజకవర్గంలో భాగమైన కందుకూరులో పాత్రికేయులకు రెండు లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి ద్వారా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కి రెండు లక్షల రూపాయల నగదు మొత్తాన్ని అందజేశారు. కందుకూరులో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అందజేసిన రెండు లక్షల రూపాయల విరాళాన్ని వారికి నిత్యావసర సరుకుల ద్వారా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీకి తన ధన్యవాదాలు తెలిపారు. విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి మాట్లాడుతూ  ఈ లాక్ దౌన్ సమయంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి  పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే కందుకూరు పాత్రికేయ మిత్రుల సంక్షేమానికి రెండు లక్షల రూపాయల మొత్తాన్ని అందజేశారని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు గుడ్లూరు ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించినట్లు తెలిపారు .నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లాక్ దౌన్ సహాయక చర్యల  నిమిత్తం ఇటీవల తన సొంత నిధులు 20 లక్షల రూపాయలను జిల్లా కలెక్టర్ కు అందజేసిన విషయం తెలిసిందే.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget