కందుకూరు పాత్రికేయులకు ఆదాల 2లక్షల విరాళం

*ఫ్లాష్*      🌈🌈🌈🌈🌈*కందుకూరు పాత్రికేయులకు ఆదాల 2లక్షల విరాళం* 

*నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన నియోజకవర్గంలో భాగమైన కందుకూరులో పాత్రికేయులకు రెండు లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు*

*విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి ద్వారా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కి రెండు లక్షల రూపాయల నగదు మొత్తాన్ని అందజేశారు* 

కందుకూరులో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని 

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అందజేసిన రెండు లక్షల రూపాయల విరాళాన్ని వారికి నిత్యావసర సరుకుల ద్వారా అందజేయనున్నట్లు తెలిపారు. 

ఈ సందర్భంగా నెల్లూరు ఎంపీకి తన ధన్యవాదాలు తెలిపారు. 

విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి మాట్లాడుతూ  ఈ లాక్ దౌన్ సమయంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి  పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. 

అందులో భాగంగానే కందుకూరు పాత్రికేయ మిత్రుల సంక్షేమానికి రెండు లక్షల రూపాయల మొత్తాన్ని అందజేశారని తెలిపారు. 

ఆయన ఆదేశాల మేరకు గుడ్లూరు ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించినట్లు తెలిపారు .

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లాక్ దౌన్ సహాయక చర్యల  నిమిత్తం ఇటీవల తన సొంత నిధులు 20 లక్షల రూపాయలను జిల్లా కలెక్టర్ కు అందజేసిన విషయం తెలిసిందే.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget