గూడూరు మున్సిపల్ కు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వితరణ

*సింహపురి రెడ్డి సంక్షేమసంఘం వారి దాతృత్వం,గూడూరు మున్సిపాలిటీకి 50,000 వితరణ*

*గూడూరు మున్సిపల్ పరిధిలో ఉన్న అర్హులైన పేదలందరినీ ఆదుకుంటాం కమిషనర్ ఓబులేసు*

ఈ రోజు సింహపురి రెడ్డి సంక్షేమసంఘం సభ్యులు గూడూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు కు మున్సిపల్ సహాయ నిధికి 50,000 రూ లను అందచేశారు..రెడ్డి సంక్షేమసంగం  అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మరి వల్ల ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం తో మున్సిపల్ పరిధిలో కూలీ పనులు చేసుకునే ఎంతో మంది పేదలు ఇళ్లకే పరిమితం కావడం తో వారికి ఆహార కోరత ఏర్పడిందని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ రెడ్డిసంఘం ద్వారా చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో మున్సిపల్ కమిషనర్ ఓబులేసు కి 50,000 రూ అందించడం జరిగింది అన్నారు,

కమిషనర్ ఓబులేసు మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా మున్సిపల్  ఎంతోమంది ఆకలితో ఉన్నారని,అన్నీ అనుకున్న ట్టు జరిగి ఉంటే ఏప్రిల్ నాటికి కొత్త రేషన్ కార్డులు వచ్చేవని కానీ ఈ కరోనా వల్ల కొత్త కార్డులు ఆగిపోవడంతో చాలా మందికి అర్హత వున్నా ప్రభుత్వ పదకాలు చేరడం లేదని అలాంటి వారికి,శానిటేషన్ లో వుండే నిరుపేదల సిబ్బందికి ఈ సహాయ నిధికి వచ్చే డబ్బులు ఉపయోగిస్తామని తెలియచేసారు..
    
ఈ కార్యక్రమంలో గూడూరు ఎమ్మార్వో లీలారాణి,వైసీపీ గూడూరు మం,రూరల్ కన్వీనర్ మల్లువిజయ్ కుమార్ రెడ్డి,రెడ్డిసంఘం సభ్యులు ఉపాధ్యక్షుడు దశరథరామి రెడ్డి,బి.సుబారెడ్డి,dr రోహినమ్మ,జనార్దన్ రెడ్డి,సురేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు...

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget