700కుటుంబాలకు రూరల్ ఎమ్మెల్యే సహాయం

నెల్లూరు 38 వ డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూరగాయలు పంపిణీ చేశారు. మొత్తం 700 కుటుంబాలకు 9 రకాల కూరగాయలను సచివాలయ సిబ్బంది ద్వారా అందజేశారు. గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ తో ముఖ్యంగా పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా సంతోషంగా ఉండాలనే తలంపుతో ప్రతీ కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు విధిగా సామాజిక దూరం పాటించాలని సూచించారు. కష్ట కాలంలో స్థానిక ప్రజలకు అండగా నిలిచిన వెంగయ్య యాదవ్, మురళీ కృష్ణ యాదవ్ లను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వైసీపీ  నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావు, హరిబాబు యాదవ్ పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget