పని చేయమన్నందుకు డాక్టర్ పై పనిగట్టుకుని విమర్శలు


విచారణాధికారి కోటేశ్వరరావు

చిట్టమూరు వైద్యాధికారి భాస్కర్ రెడ్డి హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న ఇలక శ్రీనివాసులు పై వేధింపులకు పాల్పడడం తో ఆత్మహత్యా యత్నానికి పాల్పడి స్థానిక చిట్టమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం తెలిసిందే.దీనిపై జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు విచారణ అధికారిగా కావలి ఏరియా వైద్యాధికారి  కోటేశ్వరరావును నియమించడంతో శనివారం చిట్టమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలతో విచారణ చేపట్టారు .హెల్త్ సూపర్వైజర్ ఇలక శ్రీనివాసులను విధులు సక్రమంగా నిర్వహించాలని, సమయపాలన పాటించాలని డాక్టర్ ఆదేశించడంతోనే శ్రీనివాసులు ఉద్దేశ్యపూర్వకంగా డాక్టర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని పట్టుబడుతున్నట్లు విచారణలో తేలినట్లు తెలిపారు.వైద్యాధికారి భాస్కర్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలందిస్తూ రోగులతో సఖ్యతగా ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు అని కూడా విచారణలో పలువురు తెలియజేసినట్లు చెప్పారు.అన్ని విషయాలపై సమగ్రంగా, లోతుగా విచారణ జరిపి జిల్లా కలెక్టర్ కు నివేదించనున్నట్లు కూడా ఆయన చెప్పారు.


Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget