కరోనా నివారణకు పటిష్ట చర్యలు


- బాధితుల గుర్తింపుకు ఇంటింటికి సర్వే

- కమిషనర్ పివివిస్ మూర్తి


కరోనా వైరస్ నివారణకు నగర వ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, జనసమ్మర్ధ ప్రదేశాలకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని కమిషనర్ పివివిస్ మూర్తి సూచించారు. నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక నవాబుపేటలోని మున్సిపల్ పాఠశాలలో వార్డు ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ, ఏ.ఎన్.ఎమ్. ఆశా వర్కర్లకు ఇంటింటికి సర్వే కార్యక్రమంపై అవగాహనా సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు ఆరోగ్య శాఖ సిబ్బంది కొన్ని బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి విచారిస్తారని, ఇటీవల విదేశాలనుంచి వచ్చిన వారిని గుర్తిస్తారని తెలిపారు. వైరస్ లక్షణాలను వారి కుటుంబాలకు వివరించి, బాధితులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కమిషనర్ వెల్లడించారు. కరోనా బాధితులను 14 రోజుల పాటు ప్రత్యేక వైద్య సేవలు అందించి స్వస్థత చేకూరేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసారు. కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన ప్రాధమిక జాగ్రత్తలు పాటిస్తూ, జన సమీకరణ జరిగే వేడుకలు, సభలు, వివిధ సమావేశాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని కమిషనర్ సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో ప్రత్యేక ద్రావకం పిచికారీ చర్యలు చేపట్టామని, అపరిచితులతో కరచాలనం చేయడం, సమీపంగా మెలగడం వంటి చర్యలు మానుకోవాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget