బిజెపి అభ్యర్థుల జోలికొస్తే తాట తీస్తా.. ఎస్.ఎస్.ఆర్ నాయుడు


వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త యస్ యస్ ఆర్ నాయుడు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలకు అడ్డు ఆపు లేకుండా పోయిందని అన్నారు. బి జె పి పార్టీ ఎంపిటిసి, జెట్ పి టి సి, ఎన్నికల్లో వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేకుండా అన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవం చేసుకునేందుకు, పోటీలో నిలిచిన ఇతర పార్టీల అభ్యర్థులను బయబ్రాతులకు గురిచేసి, వారిపైన లేనిపోని ఆరోపణలు చేసి, భయపెట్టి రాజకీయం చేయాలకనుకుంటే మీ అంతు చూస్తామని వై యస్ ఆర్ పార్టీ నాయకులను ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మీ బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడే వారు ఎవరూ లేరిక్కడ అని తేల్చిచెప్పారు. మా పార్టీ ఎంపిటిసి, జెట్ పి టి సి లను ఉపసంహరణ చేసుకునేలా వై యస్ ఆర్ పార్టీ నాయకులు, ఒత్తిడి తెచ్చేలా చేశారని ఆయన విమర్శించారు. మా పార్టీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థులు  తన రక్షణలోనే ఉన్నారని వారు రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని దగ్గరల పోటీ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చూశామని, మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న ఇంతటి అరాచక పాలనను నేను ఎన్నడూ చూడలేదని అన్నారు. మన ప్రజాస్వామ్యం లో ప్రజలచేత నాయకులను ఎన్నుకొనేలా నిరంతరం జరిగే ప్రక్రియకు అపహాశ్యం చేసేలా ఎన్నికల్లో నిలిచిన అభ్యర్థులను బెదిరించి, కేసులు పెట్టి ఉపసంహరణ చేయించి ఎన్నికలు జరగకుండా తమకు తామే ఏకగ్రీవం చేసుకుంటున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మీకు భారతీయ జనతా పార్టీ అండదండలు ఉన్నాయని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగినేని కృష్ణమోహన్, అల్లం చంద్రమోహన్, తమటం మణి, రమేష్, శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget