స్వేఛ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తున్నాం - జిల్లా యస్పి

ప్రత్యేక టీములచే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు పలు మార్లు సందర్శన
ప్రతి సబ్ డివిజన్ స్థాయిలో ఎన్నికలకు ప్రత్యేక పోలీసు అధికారి నియామకం
ఎన్నికల నియమావళిని ఉల్లంఘింస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు, వారిపై కఠిన చర్యలు తప్పవు
జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో జరపబడుతున్నాయని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగపరంగా కల్పించబడిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ముందస్తు ప్రణాళికతో తగు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా యస్పి మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిమిత్తం ప్రత్యేక అధికారులుగా కావలి, ఆత్మకూరు సబ్ డివిజన్ లకు అడిషనల్ యస్.పి.(క్రైమ్స్) పి.మనోహర్ రావు గూడూరు, నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ లకు అడిషనల్ యస్పి(ఎ.ఆర్) యస్.వీరభద్రుడు ప్రత్యేక అధికారులతో పాటు ఒక్కొక్క సబ్ డివిజన్ కి అదనముగా డియస్పి-01, ఇన్స్పెక్టర్స్-03 ని ఎన్నికల విధులకు ప్రత్యేకంగా నియమించడం జరిగిందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 7000 మందిని ముందస్తుగా బైండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతానికి జిల్లాలో 15 చెక్ పోస్టులు, ప్లయింగ్ స్క్వాడ్ టీములు, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు మొబైల్ పార్టీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎట్టిపరిస్థితులలోనూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించరాదని, ఉల్లంఘించన ఎడల చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొనబడుతాయని తెలిపారు. ఎక్కడైనా ఎన్నికల సందర్భంగా ఓటర్లను మభ్యపెట్టుట, ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు, డబ్బు, మద్యం మరియు బహుమతులను ఇస్తున్నట్లు తెలిస్తే ప్రజలు వాట్సప్‌ 9440796385, ల్యాండ్ నంబర్:0861-2307484 లకు ఫోన్ లేదా ఫోటోలు పంపిన యెడల తక్షణ చర్యలు తీసుకోనబడునని మరియు సమాచారమిచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచబడునని తెలిపారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget