మూడు రాజధానులు విషయంలో వెన్నక్కి తగ్గేది లేదు..!

దిశ చట్టంతో మహిళలకు అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..!
దేశంలో ఆదర్శ రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్..
కోటలో మీడియా సమావేశంలో మాట్లాడిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి..!


రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలపై అసత్యాలు ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ పతనం దగ్గర పడిందని కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు.. కోటలో శ్రీ లక్షమ్మ గిరిజన కాలనీ జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కుంభాభిషేకాల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు..రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యనిస్తూ ‘దిశ’ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు శాసనసభలో తీర్మానం చేశారన్నారు. దిశ పోలీసు స్టేషన్లు, దిశ ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు, ఈక్రమంలో ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ ఎస్‌ఓఎస్‌ యాప్ ద్వారా రక్షణ కోరిన ప్రభుత్వ మహిళా అధికారికి పోలీసులు అండగా నిలిచి ఆమెను వేధింపులకు గురిచేసిన ఓ వ్యక్తి చార్జిషీట్‌ను(అభియోగ పత్రం) కేవలం 24 గంటల్లోనే ఎక్సైజ్‌ కోర్టులో దాఖలు చేయడం గమనార్హమన్నారు. ఈ నెల 9న అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను మూడు రోజుల్లోనే 35 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకోవడం విశేషమన్నారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్‌ అమలు చేశారన్నారు. పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్లో అంగ్ల విద్యను. అమలు చేస్తున్న గొప్ప నేత సీఎం జగన్‌ అన్నారు. అందులో భాగంగా ఈ నెల 24న విజయనగరం జిల్లాలో   ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారని తెలిపారు..ఈ సమావేశంలో నల్లపరెడ్డి జగదీష్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మొబీన్ బాషా, చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నారు..

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget