అఖిల భారత బీమాక్షేత్ర ఉద్యోగుల జాతీయ సమాఖ్య....

నెల్లూరు, ఫిబ్రవరి 03, (రవికిరణాలు) : 2020-21 సంవత్సరానికిగాను ఫిబ్రవరి 1 శనివారం నాడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్ధికబడ్జెట్లో, ఎల్‌ఐసి లో ఉన్న ప్రభుత్వ వాటాను కొంతమేర అమ్మేందుకు ప్రతిపాదించబడినది. భవిష్యత్తులో అత్యధికవాటాను అమ్మేందుకు ఈ చర్య దారితీస్తుంది.ఈ ప్రకటనవల్ల ప్రభుత్వ సంస్థ అయిన జీవిత బీమా సంస్థ యొక్క స్వరూపమే మారిపోనున్నదని, తద్వారా కోట్ల పాలసీదారులకేకాక యావత్తెశానికి నష్టం వాటిల్లుతుందనే భావన ప్రభలుతోంది. తమ కష్టార్జితం సైతం ధీమాగా ఎల్‌ఐసి ఆఫ్‌ ఇండియా లో పెట్టే ప్రజల విశ్వాసం బీటలు వారుతోంది. ఇదే జరిగితే, దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నపుడు ఆదుకునే శక్తి ఇకపై ఎల్‌ఐసికి ఉండదు. అంతేకాక దేశ ప్రయోజనాలకోసం ప్రభుత్వానికి అత్యధిక మొత్తంలో ఇచ్చే డివిడెండ్ (గతసంవత్సరంఇది 2611 కోట్లు) పై ఇది ప్రభావం చూపుతుంది. జీవిత బీమా సంస్థ యొక్క పునాదిఎంలో పటిష్టమైనది కావడంవల్లనే గత 20 సంవత్సరాలుగా 23 ప్రైవేట్సం స్థలతో పోటీపడుతూ కూడా మార్కెట్వాటాను 70% కి పైగా స్వంతం చేసుకుంది. నిజానికి ఈ సంవత్సరంలో ఎల్‌ఐసి 6% మార్కెట్వాటాను తిరిగి చేజిక్కించుకొంది. ఇన్సూరెన్స్మార్కెట్ అభివృద్ధితో పోలిస్తే ఎల్‌ఐసి గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఎస్‌ఐసి లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ భారత ఆర్థిక వ్యవస్థకు, దేశ అభివృద్ధికి హానికరం. ఈ నిర్ణయాన్ని అఖిల భారత బీమా క్షేత్ర ఉద్యోగుల జాతీయ సమాఖ్య తీవ్రంగా ఖండిస్తూ సోమవారం భోజనసమయంలో నిరసన ప్రదర్శన, 4వ తేదిన ఒకగంట సమ్మెద్వారా తమ తొలి స్పందనను తెలియజేస్తుందన్నారు.అఖిల భారత ప్రజానీకం మనకు మద్దతునిస్తారని, భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తుందని తెలియజేశారు...

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget