ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి


నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం, డేగపూడి గ్రామంలో పర్యటించి, రైతులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే కాకాణి కి రైతులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.ఎమ్మెల్యే కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పలు కుటుంబాలు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ రైతులకు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాం.గతంలో తక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అటువంటి ఇబ్బందులు కలగకుండా, ఈ ఏడాది అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కేంద్రాల నిర్వహణ అధిక భాగం కేంద్రాల సంఘ బంధాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది.మహిళలపై ఉన్న నమ్మకంతో వారికి అప్పగించడం జరిగింది.రానున్న రోజుల్లో మహిళలు నిర్వహించే కేంద్రాల్లోనే మాకు న్యాయం జరుగుతుందనే పేరు తెచ్చుకునేలా వీటిని నిర్వహించాలి.గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా నడ్డివిరిచిన పరిస్థితి.గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సాంకేతిక సమస్యలను అధిగమించి,  రైతులకు ఇబ్బందులు లేకుండా  చూడాలి.
బస్తాల పంపిణీ, తేమ శాతం విషయంలో కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.గతంలో రైతుల సంక్షేమం గురించి ఆలోచన చేసిన వ్యక్తి మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఒక్కరే.ఈరోజు కండలేరును అభివృద్ధి చెసుకున్నామంటే రాజశేఖర్ రెడ్డి పుణ్యమే.అందుకే రాజశేఖర్ రెడ్డి పాలనను తిరిగి తెచ్చుకున్నాం.గతంలో సాగు నీటి విషయంలో రాజకీయాలు చేసి, దుర్మార్గపు  పాలన సాగించారు.ఇప్పుడు ఎక్కడా సాగునీటి విషయంలో రాజకీయాలు లేకుండా, రైతులను రైతులుగానే చూసి, సాగునీటిని పంపిణీ చేయడం జరిగింది.
మద్దతు ధర విషయంలో ఎక్కడా రైతులకు నష్టం కలగకుండా చర్యలుతీసుకోవడం జరిగింది.
గతంలో రైతులకు ఇచ్చిన మాట మరచి చంద్రబాబు మోసం  చేశాడు.కానీ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట కన్నా మిన్నగా, ముందుగా ఇస్తున్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందించే బాధ్యత నాది.చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తాము.గత ప్రభుత్వంలో  ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చి, స్థలాలు చూపని పరిస్థితి.ప్రస్తుతం కోట్ల విలువైన స్థలాలను అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.అన్ని సమస్యలను పరిష్కరించి, అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన వారికీ అందజేయడం జరుగుతుంది.గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన పాపాలను సరిచేసి, అర్హులకు న్యాయం 
చేస్తున్నాం.ప్రతి అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయడం జరుగుతుంది.ప్రభుత్వంకు మద్యం పై ఆదాయం వస్తున్నా, మహిళల కంట కన్నీరు  రాకూడదనే విధంగా మద్యపాన నిషేధానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.ఈ ప్రాంతంలో నేను జెడ్పీ చైర్మన్ గా ఉన్న సమయంలో పశువైద్య శాలను ప్రారంభించాము.గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాము.నేను మీకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతాను.డేగపూడి , బండేపల్లి కాలువ పనులన్నీ చేస్తాము.ఈ ప్రాంతానికి సమగ్రంగా సాగునీరు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తా.పది మందికి అన్నం పెట్టే రైతన్నలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా వారికి అండగా ఉంటాను.ఎమ్మెల్యే అంటే  మీకు అతిపెద్ద సేవకుడిలా,మీ  సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే కాకాణి తెలియజేశారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget