వికేంద్రీకరణకు మద్దతుగా మానవహారం

మనుబోలు, పిబ్రవరి 06, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు జాతీయ రహదారిపై ఆంధ్ర రాష్ట్ర పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా ఏర్పాటు చేసిన మానవహారంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చెందితే, భవిష్యత్తు తరాలకు బాగుంటుందని భావిస్తున్నారు.అందుకే మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుతో, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కానీ చంద్రబాబు మాత్రం అమరావతి రైతుల కోసం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.
వాస్తవానికి తను అక్రమంగా లాకున్న భూముల ధరలు ఎక్కడ పడిపోతాయనే భయంతో చంద్రబాబు నీచ రాజకీయాలకు తెరలేపాడు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండడం మన దురదృష్టకరం.శాసనసభలో ప్రజలకు ఉపయోగపడే ఏ చట్టాన్ని తెచ్చిన, దాన్ని అడ్డుకునే నీచ స్థితికి చంద్రబాబు చేరాడు.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు.కానీ చంద్రబాబు మాత్రం ప్రజల అభివృద్ధిని, పక్కన పెట్టి వెన్నుపోటు  రాజకీయాలు చేస్తున్నాడు.గతంలో రామారావుగారిని వెన్నుపోటు పొడిచాడు, ఇప్పుడు స్వంత 
ప్రయోజనాల కోసం అమరావతి రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు అమరావతిలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడు.లక్ష కోట్లతో రాజధాని నిర్మిస్తామని చెప్పి, గత 5 ఏళ్లలో తాత్కాలిక నిర్మాణాలు చేశారే తప్ప, అభివృద్ధి చేసింది శూన్యం.గతంలో అభివృద్ధి జరిగిన హైదరాబాద్ ని అన్ని  వదిలి రావలసిన పరిస్థితి ఏర్పడింది.రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదనే విధంగా చంద్రబాబు కుటీల రాజకీయo 
చేస్తున్నాడు.చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ద్రోహిగా చంద్రబాబు మిగిలి పోయాడు.
పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా కార్యక్రమం నిర్వహించడం అభినందినీయమని అన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget