బాలికలపై అత్యాచారం చేసిన వారిని వెంటనే ఉరి తీయాలి...

కోట, జనవరి09, (రవికిరణాలు) : కోట విద్యానగర్ కూడలి దగ్గర గూడూరు నియోజక వర్గం చవట పాలెం పర్వీన్ హత్యా చరణ ఘటనకు సంబంధించి దోషులను ఉరి తీయాలని ఎమ్‌జెఎస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మహాజనసైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు చేవూరు.సురేంద్ర మాట్లాడుతూ  ఘడియలు,గంటలు,నెలలు, సంవత్సరాలు మారుతున్నాయి కానీ మనిషి జీవితంలో మార్పు రావటం లేదు.ఆడబిడ్డలు అశువులు బాస్తున్నారు, బలిపీఠాలపై బలవుతున్నారు.మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి మనిషులు అన్న సంగతి మరిచి కిరాతకంగా క్రూర మృగం సైతం సిగ్గుపడే విధంగా ప్రవర్తిస్తూ ఆడబిడ్డలను కామ వస్తువుగా చూస్తూ, మన తల్లి ,చెల్లి కూడా అడవారేనన్న విషయం మరిచిపోయి, తల్లి ఆడవారికి జన్మనిచ్చేటందుకే బయపడే దుస్థితికి సమాజాన్ని నడిపిస్తున్న నరరూప రాక్షసుల్ని మార్పు చెందించటానికి ఏ దేవుడు దిగి రావాలో, ఏ మహానుభావుడు ఉద్భవించాలో ఎవరు చెప్పలేని పరిస్థితి.అటువంటి నీచాతి నీచమైన సమాజాన్ని నిర్మించిన దౌర్భాగ్య మానవజన్మ మనదేనేమో అన్నా సందేహం లేదు.మానసిక వికలాంగురాలు ఫర్వీను ను సైతం వదలని సిగ్గుమాలిన సమాజంలో బ్రతుకు వీడుస్తున్నాము.ఉరి, ఎన్కౌంటర్,జైలుశిక్ష, రాస్తారోకోలు, ధర్నాలు, మానవహారాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నాము కానీ మార్పు ఎక్కడా కాన రాలేదు. మరి మార్పు అనే వెల కట్టలేని వజ్రం దొరికేది బడిలోన లేక తల్లి ఒడిలోన అంటే ఖచ్చితంగా వీటిలోనే అని ఒకింత చెప్పవచ్చు. అటువంటి నవ నూతన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కాదు ప్రతి పౌరుడిది అటువంటి మనుషులు కలిగిన సమాజాన్ని చూడాలని  ప్రతి ఒక్కరు తన వంతు బాధ్యతగా ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహాజనసైన్యం (ఎమ్‌జెఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు చేవూరు. సురేంద్ర, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ యల్లసిరి.నాగార్జున, హరి,విష్ణు,సదా, సాయి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget