ముగిసిన నెల్లూరు ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలు....

విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు , మండ్ల.సురేష్ బాబు 
నేటి యువత ఎమ్మెల్యే వరప్రసాద్ రావును ఆదర్శంగా తీసుకోవాలని సూచించిన మండ్ల.సురేష్ బాబు

గూడూరు, ఫిబ్రవరి 01, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఏర్పాటై ఉన్న అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న నెల్లూరు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ముగిశాయి.శుక్రవారం నాడు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్ధానిక ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, విశిష్ట అతిథిగా చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు వైకాపా నాయకులు మండ్ల.సురేష్ బాబు హాజరయ్యారు.ఫైనల్స్ లో తడ జట్టు విజేతగానిలిచి 50 వేల రూపాయలు మొదటి బహుమతిని గెలుపొందగా, 30 వేల రూపాయలు రెండవ బహుమతిని గూడూరు ఆర్.ఎల్.సీ.సీ జట్టు గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా కార్తీక్ గెలుపొందారు. ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, మండ్ల.సురేష్ బాబు చేతుల మీదుగా విజేతలకు విన్నర్స్ ట్రోఫీని, బహుమతులు అందజేశారు. అదేవిధంగా క్రీడాకారులకు జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా, మానసిక ఉల్లాసంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల మక్కువ చూపాలని, వచ్చే ఏడాది కూడా ఈ క్రికెట్ పోటీలను ఘనంగా నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అనంతరం మండ్ల.సురేష్ బాబు మాట్లాడుతూ గూడూరు పట్టణం క్రీడలకు పుట్టినిల్లు అని కొనియాడారు. ఎంతోమంది యువ క్రీడాకారులు రాష్ట్ర , జాతీయ స్థాయిలో రాణించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే వరప్రసాద్ రావు నిత్యం శ్రమిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతూ అరవై ఏళ్ల వయస్సులో పదహారేళ్ళ యువకుడిలా నిత్యం వాకింగ్, వ్యాయామం వంటివి చేస్తూ నేటి యువతకు స్పూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రతి  క్రీడాకారుడు ఎమ్మెల్యే వరప్రసాద్ రావును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు చంద్రనీల్, మస్తాన్, విజయ్, నాగరాజు, జితేంద్ర, చేగువేరా పైలట్ టీమ్ సభ్యులు క్రాంతి, వినోద్, శ్రీను, కిరణ్ ఇంకా పలువురు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget