ఎమ్మెల్యే ప్రసన్న ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంస


 కోవూరు, జనవరి 07, (రవికిరణాలు) : కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి ప్రశంసించారు. మంగళవారం సాయంత్రం కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం 2 కోట్ల 30లక్షల రూపాయలతో చేపట్టిన 7అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రసన్నతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇతర ఎంపీల నుంచే కాక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెడ్డి నుంచి కూడా నిధులు మంజూరు చేయించుకున్నారని కొనియాడారు. అది కోవూరు నియోజకవర్గంపై ఆయనకున్న శ్రద్ధ అని పేర్కొన్నారు. కోవూరు
నియోజకవర్గంలో దాదాపు 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారని, నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించనుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేవలం సంక్షేమం పైనే దృష్టి సారించారని కొంత మంది మాట్లాడుతున్నారని, అది నిజం కాదని పేర్కొన్నారు. అందుకు మంచి ఉదాహరణ గా ఈ నియోజకవర్గాన్ని ఉదహరించవచ్చు నని చెప్పారు. రానున్న నాలుగేళ్లలో జిల్లాలో రెండు వేల కోట్ల రూపాయలతో ఇరిగేషన్ పనులు జరగనున్నాయని తెలిపారు. గతంలో రోడ్లు మాత్రమే వేస్తే ఇప్పుడు డ్రైన్లు కూడా పూర్తవుతాయని తెలిపారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించనుందని తెలిపారు. తన ఎంపీ నిధుల నుంచి నియోజకవర్గానికి రెండు కోట్ల రూపాయలు కేటాయించానని, వీటిని అభివృద్ధిపనులకు వినియోగించాలని కోరారు. డీసీఎంఎస్ అధ్యక్షునిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన వీరి చలపతి కి తన అభినందనలు తెలియజేశారు. కొత్తగా ఎంపికైన గ్రామ వాలంటీర్లతో మాట్లాడిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, చక్కగా సేవ చేయాలని వారికి పిలుపునిచ్చారు. నార్త్ రాజుపాలెం లో జరిగిన ఏడు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు స్థానికులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. ఈ కార్యక్రమాల్లో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి డిసిఎంఎస్ అధ్యక్షులు వీరి చలపతి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget