ఎన్‌ఆర్‌సి, సిఏఏ కు వ్యతిరేకంగా మానవహారం

సూళ్లూరుపేట,జనవరి 8,(రవికిరణాలు) : సూళ్లూరుపేటలో పట్టణ పరిధిలోని బుధవారం సిఐటియు దాని అనుబంధ సంఘాలైన అంగన్ వాడి, ఆషా, లారీ, భవనం, మున్సిపల్, ఆర్టీసి ఎఐటియుసి, రైతులు,ఆటో మధ్యాహ్న భోజన సమయంలో కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. ఉపాధ్యాలు సంఘీభావము ప్రకటించారు. మొట్టమెదటగా కోస్టల్ కారిడార్ కార్మికులు కార్యదర్శి మోహన్ రావ్ ర్యాలి ప్రారంభించారు. ర్యాలీలో కేంద్రప్రభుత్వ కార్మిక కర్షక వ్యతిరేక విధనాలు నిరసిస్తూ కనీస వేతనాలు 21వేలు, పి.యఫ్ ఈయస్ఐ కార్మికులందరికి అమలు చేయాలని, పెన్షను 10 వేలు చేయాలని, ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక చట్టాలను మార్చవద్దని, కాంట్రాక్ట్ కార్మికులు పద్దతి వద్దని, స్కీము వర్కర్లని (అంగన్వాడి, ఆషా, మిడ్డే మీల్స్ తదితరులు) కార్మికులు గా గుర్తించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, స్వామినాథన్ కమిటి సిఫారసులు అమలు చేయాలని, కౌలు రైతులకు ఱుణాలు ఇవ్వాలని వ్యవసాయ కార్మికులకు వేతనాలు పెంచి పనిదినాలు 200లకు పెంచాలన్నారు. ప్రజలు గుర్తింపు పేరుతో నేషనల్ రిజిస్ట్రేషను సిఏఏ తదితర ప్రజల వ్యతిరేక విధానాలు వద్దని మత ఛాందస చర్యలు ఆపాలని నినాదాలు చేసారు. తదుపరి ఆర్టీసి బస్టాండులో మానవ హారము నిర్వహించారు. ఈ మీటింగులో సిఐటియు నాయకులు.కె.సాంబశివయ్య, సుధాకర్ రావ్,
అల్లెయ్య, జిల్లా సిఐటియు నాయకులు కె.పద్మనాభయ్య, ఏఐటియుసి నాయకులు కె.క్రిష్ణ, యస్ డబ్లు యఫ్ నాయకులు రమణయ్య, అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు హైమావతి, ఆషా వర్కర్లు డివిజన్ కార్యదర్శి లక్ష్మి, లారి కార్మిక నాయకుడు విజయ, మధ్యాహ్న భోజనం రాజేశ్వరి,కళాకారులు ఇన్ ఛార్జ్ మునెయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు.


Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget