పదవి విరమణ పోలీసు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా యస్పి


ఎప్పుడైనా, ఎక్కడైనా ఎలాంటి అవసరం వచ్చినా అన్నీ విధాలా సహాయ సహకారాలు అందిస్తా - యస్పి 
పదవీ విరమణ రోజే అన్నీ రిటైర్మెంట్ బెన్ఫిట్స్ అందించినందుకు ధన్యవాదాలు
నెల్లూరు, జనవరి 31, (రవికిరణాలు) : శుక్రవారం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ నందు ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ సిబ్బంది మొత్తము ఇద్దరు(1) ఉమెన్ యస్.ఐ. జి.ఉమాదేవి, డిటిసి (2) స్టెనో- వి.జి.క్రిష్ణమూర్తి, డిపిఓలను జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ అధికారులు, పోలీసు అసోసియేషన్ సంఘ సభ్యులు, పోలీసు కుటుంబాల సమక్షంలో ఘనముగా సన్మానం చేసి జ్ఞాపికతో మరియు పూలమాలలతో సత్కరించడం జరిగినది.ఈ సందర్భంగా జిల్లా యస్పి మాట్లాడుతూ పదవీ విరమణ చేయుచున్న వారంతా నా తల్లిదండ్రులతో సమానం అని, మనమంతా కూడా ఒకే పోలీసు కుటుంబం అని, పదవీ విరమణ రోజే అన్నీ రిటైర్మెంట్
బెన్ఫిట్స్ అందించాము. మిగిలినవి త్వరలో అందేటట్లు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోజు పదవీ విరమణ పొందిన అధికారులు అందరూ ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి అవసరం వచ్చినా, ఎక్కడ ఉన్నా సరే అన్నీ విధాలా సహాయ సహకారాలు అందిస్తానని జిల్లా యస్పి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు నుండి వారి తల్లిదండ్రులు దైవసమానులని, వారిని అన్నీ విధాలా ఆదరిస్తూ, ప్రేమతో చూసుకోవాలని తెలుపుతూ పోలీస్ బ్యాండ్ వాయిద్యాల మధ్య స్వయంగా కుటుంబ సభ్యులందరినీ వారి ఇంటి వద్ద క్షేమంగా చేర్చుటకు వాహనాలు ఎక్కించి ఘనంగా వీడ్కోలు పలికారు.ఉద్యోగ విరమణ పొందిన అధికారులకు నెల్లూరు జిల్లా పోలీస్ సిబ్బంది అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు అడిషనల్ యస్పి క్రైమ్స్ పి.మనోహర్ రావు, ఏఓ తెలియపర్చినారు. ఈ కార్యక్రమానికి పోలీసు అసోసియేషన్ సంఘ అద్యక్షులు మద్దిపాటి ప్రసాద్ రావు అధ్యక్షత వహించగా, ఆర్‌ఐ వెల్ఫేర్, పదవీ విరమణ పొందుతున్న అధికారుల కొడుకులు-కుమార్తెలు ఉన్నత ఉద్యోగాలలో ఉండడం సంతోషకరమైన విషయమని, వీరి జీవితం ఆనందమయంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు అందజేశారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget