నవశకం పై ప్రత్యేక అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

నెల్లూరు, జనవరి 11, (రవికిరణాలు) : నవశకం కార్యక్రమానికి సంబంధించి పరిపాలన అనుమతులు, గ్రౌండింగ్ ప్రక్రియను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఈనెల 13వ తేదీలోపల పూర్తి చేయాలని జిల్లా కలెక్టరు సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం ఉదయం స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో నెల్లూరు, గూడూరు, కావలి, నాయుడు పేట, ఆత్మకూరు డివిజన్ ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి గ్రామ సచివాలయ ఏర్పాటు, గ్రామ సచివాలయాల్లో అవసరమైన ఫర్నీచర్ తదితర సదుపాయాలు క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు.అనంతరం ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా దీవెన, రేషన్ కార్డుల పంపిణి, నాడు - నేడు, తదితర అంశములపై సమీక్షించారు. నాడు - నేడు కార్యక్రమం ద్వారా చేపట్టవలసిన 1027 పనులకు సంబంధించి గ్రౌండింగ్ ఎంత అయినది, పరిపాలన అనుమతులు ఎంత వరకు అయినది వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమం ద్వారా త్రాగునీటి వసతి, మరుగుదొడ్ల నిర్మాణం, ఫర్నీచర్ , ఫ్యాన్లు ఏర్పాటు, ప్రహరి గోడల పనులను ఎంత వరకు చేపట్టింది సేకరించారు. ప్రత్యేక అధికారులు ఆయా మండల అధికారులతో సమావేశాలు నిర్వహించి అవసరమైన పనులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. నిర్లక్ష్యం వహించిన అధి కారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా చేపట్టిన 1156 పనులకు గాను ఎన్ని పనులు ప్రారంభించింది, యింకనూ గ్రౌండ్ చేయవలసిన వాటిని ఈ నెల 13వ తేదీలో పల పూర్తి చేయాలని ఆయన తెలిపారు. పంచాయితీరాజ్ శాఖ ద్వారా 662 పనులకుగాను, ఎన్ని పనులకు పరిపాలన అనుమతులు
లభించింది, లక్ష్యసాధనకుఅవసరమైన పనులను త్వరితగతిన చేపట్టాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టరు డా. వి.వినోద్ కుమార్, డి.ఆర్.డి.ఎ. పి.డి. శీనా నాయక్, ముఖ్య ప్రణాళికాధికారి సురేష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget