గ్రామాలు, పట్టణాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

నెల్లూరు, జనవరి 26, (రవికిరణాలు) : జిల్లాలో గ్రామాలను, పట్టణాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువుగా అందజేయుటకు గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరిబాబు తెలిపారు. 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరి బాబు జాతీయ పతాకావిష్కరణ గావించి, పోలీసు, ఎన్.సి.సి.దళాలచే గౌరవ వందనం స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరిబాబు జిల్లా ప్రగతిపై ప్రసంగిస్తూ, అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుతో పాటు పారదర్శకతతో కూడిన సుపరిపాలన అందించాలన్న లక్ష్యంతో జిల్లాలో గ్రామ! వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టి, ఈ సచివాలయాల ద్వారా 530 రకాల సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలిపి, సంక్షేమ ఫలాలను సత్వరమే అర్హులందరికీ వారి వారి ఇండ్లకు అందించే విధంగా
జిల్లాలోని గ్రామీణ, పట్టణప్రాంతాలలో 10,922 మంది వాలంటీర్లను నియమించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, జిల్లాలో ఈ కార్యక్రమం క్రింద ఇప్పటి వరకు వివిధ సమస్యల పై 47,526 అర్జీలు స్వీకరించగా, 45,128 అర్జీలను పరిష్కరించడం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత యిస్తున్నదని, అందులో భాగంగా వై.ఎస్.ఆర్. రైతు భరోసా మరియు పి.ఎం. కిసాన్ క్రింద ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి రాయితీగా 13,500 రూపాయలుచొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 1
లక్షా 89 వేల రైతు కుటుంబాలకు 159 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమచేయడం జరిగిందని, కౌలు రైతులకు కూడా ఈ పధకాన్ని అమలు చేయబడుచున్నదని కలెక్టర్ తెలిపారు. 2020 ఫిబ్రవరి నాటికి ప్రతి మండలానికి 5 వంతున జిల్లాలో 230 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసి, ఈ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధృవీకరించిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు పంపిణీ, రైతులకు సాంకేతిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఉద్యాన రైతుల సంక్షేమం కొరకు సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్, ఇతర పథకాల ద్వారా 17 కోట్ల రూపాయలు కేటాయించి, ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమైనదని కలెక్టర్ తెలిపారు. 2019-20 సంవత్సరానికి గాని 27,170 ఎకరాలలో 71 కోట్ల రూపాయల వ్యవయంతో బిందు తుంపర్ల సేద్య పరికరాలను అమర్చుటకు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 5,874 ఎకరాలలో 13 కోట్ల 30 లక్షల రూపాయల రాయితీతో బిందు మరియు తుంపర్ల సేద్య పరికరాలను అమర్చడం జరిగిందని కలెక్టర్ వివరించారు. కేంద్ర సహకార బ్యాంకు మరియు ఇతర బ్యాంకుల ద్వారా 99 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల సభ్యులకు స్వల్పకాలికి పంట ఋణాల క్రింద 177 కోట్ల రూపాయలు, దీర్గకాలిక పంట ఋణాల క్రింద 18 కోట్ల రూపాయలు పంపిణీ చేయడంతో పాటు 83 ప్రాధమిక వ్యవసాయ సంఘాల
ద్వారా 11 కోట్ల 36 లక్షల రూపాయల విలువ గల 11,795 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతాంగానికి సరఫరా చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget