నిధుల సద్వినియోగంతో జిల్లాను అభివృద్ధి చేద్దాం

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి 

నెల్లూరు, జనవరి 07, (రవికిరణాలు)  : కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద కేటాయించే నిధులను సద్వినియోగం చేయడం ద్వారా జిల్లాను అభివృద్ధి చేసుకుందామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షక సంఘ సమావేశ సమీక్ష మంగళవారం కొత్త జడ్పీ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు లోక్సభ భ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మొదటిసారిగా జరిగిన ఈ సమావేశంలో అధికారుల పరిచయం, వారి విభాగాల పనితీరు తెలిసిందని, వచ్చే
సమావేశానికి మంచి ప్రతిపాదనలతో రావాలని కోరారు. జిల్లాకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి తెచ్చుకుందామని, అందుకు తగిన కృషి జరగాల్సి ఉందని అన్నారు. జిల్లాలో కేంద్రీయ విద్యాలయం కోసం ఢిల్లీ వెళ్లి అధికారులు కలిస్తే, వారు చాలా చక్కగా స్పందించారని, మనకు నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. కావలిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు తాత్కాలికంగా జడ్పీ స్కూల్ లో ఏర్పాటు చేయగలిగితే, వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో దాన్ని ప్రారంభించవచ్చునని సూచించారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే తో సంప్రదించి తగిన ఏర్పాట్లు చేయాలని జడ్పీ సీఈఓ సుశీల కు సూచించారు. నీటి పథకాలకు,
హౌసింగ్, లిఫ్ట్ పథకాలకు నిధులు మంజూరు చేసుకునేందుకు కష్టపడదామని, అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. కొన్ని పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో నిధుల కొరత ఉందని, కేంద్రం నుంచి సరిపడా నిధులు తెచ్చుకుంటే దాన్ని అధిగమించవచ్చునని సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సూచనలు అమలు చేద్దా మని ఈ సందర్భంగా తెలిపారు. ఫిబ్రవరిలో మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని, నిధుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, వాటి మంజూరుకు హామీ ఇచ్చారు. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు తనకు అందజేస్తే వాటి మంజూరుకు కృషి చేస్తారని అంతకుముందు జరిగిన సమావేశంలో అధికారులకు సూచించారు. ఈ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షక సంఘ సమావేశం సమీక్షలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, జె సి వినోద్ కుమార్,  విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి,  నగర కమిషనర్ మూర్తి, డిఆర్డిఎ పిడి సీనా నాయక్, నరసింహ రావులతోపాటు జిల్లా అధికారులు ఈ సమావేశంలో  పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget