స్వర్ణాల చెరువులో మహాశివలింగాన్ని నిర్మించాలి....విహెచ్‌పి నేతల డిమాండ్‌

నెల్లూరు, జనవరి 29, (రవికిరణాలు) : తెలుగురాష్ట్రాలలో ప్రభుత్వం అనుసరిస్తున్న హిందూవ్యతిరేక విధానాలకు నిరసనగా విశ్వహిందూ పరిషత్‌ గాంధీబొమ్మ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. దేవాలయాల భూములు అన్యమతస్థులకు అప్పగించే చర్చలను ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో క్రిస్టియన్‌ మతప్రకారానికి ప్రభుత్వం పూర్తి సహకారమందిస్తుంది. పాస్టర్లకు జీతాలను ప్రభుత్వం చెల్లిస్తామనడంతో కొన్ని వందల చర్చిలు
నిర్మాణంలో వున్నాయన్నారు. చర్చిల నిర్మాణానికి నిధులు సమకూర్చడం మాత్రమేకాదు.. నెల్లూరు స్వర్ణాల చెరువులో మహాశివలింగాన్ని నిర్మించాలని విహెచ్‌పి నేతలు డిమాండ్‌ చేశారు. హిందూ దేవాలయాలలో సేవాటిక్కెట్లు, అద్దెరూమ్‌ల ధరలను పెంచడం, విగ్రహాలు ద్వంసం చేయడం, గోవులఅక్రమ రవాణాకు సహకరించడం లాంటి చర్యలు హిందూ ధర్మంపై దాడిగా పేర్కొంటూ ధర్నా ద్వారా నిరసన తెలుపుతున్నామన్నారు. తెలుగురాష్ట్రాలలో మతపరమైన దాడులకు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలే కారణమని విహెచ్‌పి నేతలు స్పష్టం చేసారు. పాస్టర్లకు,ముల్లాలకు జీతాలిస్తూ హిందూ ఆలయాలలో భక్తులపై ఆర్ధికభారం మోపడం హిందూ వ్యతిరేకవిధానాలు. విహెచ్‌పి జిల్లాకార్యదర్శి మిద్దెశ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో నేతలు డేగమల్లారెడ్డి, ఏవిఆర్‌ మోహన్‌రావు, రాజేంద్ర, పట్నం మోహనరావు, విశ్వనాథ్‌, ధన్విశ్రానివాస్‌, భజరంగదల్‌ నేతలు మదన్‌, శశి, వెంకటేష్‌, బిజెపి నేత మిడతల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget