ఘనంగా ఎన్టీఆర్‌ 24వ వర్ధంతి వేడుకలు..

చిత్తూరు జిల్లా పలమనేరులో స్థానిక టిడిపి నేతలు శనివారం స్వర్గీయ నందమూరి తారకరామారావు 24వ వర్ధంతిని ఘనంగా పట్టణంలో నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు సుదీర్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాలలో అనేకమంది చిన్న పెద్ద నాయకులు తయారయ్యేందుకు కారణం స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. సమాజం కోసం ఆయన మరలా మరలా పుట్టాలని ఆశించారు. ప్రధాన కార్యదర్శి ఆర్ బిసి కుట్టి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపితము చేసిన తొమ్మిది నెలలకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్ కే దక్కిందన్నారు. పేదలకు కూడు గుడ్డ ఆసరా ఉండాలని పరితపించిన నాయకుడు కూడా ఆయానేనని కొనియాడారు. తెలుగు జాతి గౌరవాన్ని యావత్తు ప్రపంచమునకు అందించిన కీర్తి కూడా స్వర్గీయ నందమూరిదేనని నాయకులు ప్రసాధనాయుడు, బాలాజీ నాయుడు, జగదీష్ నాయుడులు అన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బనాగయ్య, అములు, నాగరాజు, గిరిబాబు, ఆఫ్రోజ్, ఖాజా, బ్రహ్మయ్య, దీపికా కృష్ణ మూర్తి, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget