లేక్‌ వ్యూ ఫెస్టివల్‌కు జార్జిరెడ్డి

స్టూడెంట్‌ లీడర్‌ జార్జిరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'జార్జిరెడ్డి'. సందీప్‌ మాధవ్‌ టైటిల్‌ రోల్లో, జీవన్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అప్పిరెడ్డి, సంజయ్‌రెడ్డి, దామోదర్‌ రెడ్డి నిర్మించారు. నవంబరు 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా 'జార్జిరెడ్డి' చిత్రం ఫోర్త్‌ లేక్‌ వ్యూ ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైంది. ఈ నెల 22, 23 తేదీల్లో ఈ చిత్రాన్ని ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఢిల్లీ, నోయిడాల్లో ఈ చిత్రం ప్రత్యేక పదర్శనలు జరుగనున్నాయి. ''చిన్న సినిమాగా విడుదలైన మా 'జార్జిరెడ్డి' ఇండస్ట్రీని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లెవల్‌కి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది'' అని చిత్రబృందం పేర్కొంది. ఈ వేడుకకు చిత్రయూనిట్‌ హాజరు కానుంది.

Post a comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget