ప్రతి ఒక్కరినీ ప్రేమించి..

శత్రువులనైనా క్షమించే ఆదర్శ జీవనమే క్రీస్తు తత్వం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి


అమరావతి, డిసెంబర్, 24, (రవికిరణాలు) : క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు...పరిశ్రమలు, వాణిజ్యం, ఐ.టీ, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, సమస్త జీవులపై కరుణ కలిగిన యేసు ప్రభువు జీవనశైలిని, బోధనలను పాటించడమే క్రిస్ మస్ పండుగకు అసలైన అర్థమన్నారు. శాంతియుత జీవనం, శత్రువునైనా క్షమించే గుణం ప్రస్తుత సమాజానికి అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మానవాళికి జీసస్ తన జీవితం ద్వారా ఇచ్చిన మహోన్నత సందేశాలని పాటించడం ద్వారా సమసమాజం సాధ్యపడుతుందన్నారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget