హైవే మొబైల్స్ పనితీరును సమీక్షించిన జిల్లా యస్పి

హైవే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గించాలి
రోడ్డు ప్రమాదం సంభవించిన వెంటనే “గోల్డెన్ అవర్” స్పందన మెరుపు వేగంతో ఉండాలి
నైట్ పెట్రోలింగ్ లో విజిబిలిటీ కోసం మొబైల్స్ తప్పనిసరిగా ట్రాఫిక్ లైట్ లు ఉపయోగించాలి
నెల్లూరు, డిసెంబర్‌ 27, (రవికిరణాలు) : శుక్రవారం జిల్లా యస్పి భాస్కర్ భూషణ్ జిల్లాలోని ఆంధ్ర తమిళనాడు బోర్డర్ పెద పన్నంగాడు నుండి ప్రకాశం బోర్డర్ చేవూరు చెరువు వరకు గల నేషనల్ హైవే మీద 24 గంటలూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న 10 హైవే మొబైల్స్, ఒక ఇంటర్ సెప్టర్ వెహికల్ డ్రైవర్స్ యొక్క పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యస్పి హైవే మొబైల్స్ పార్టీలతో మాట్లాడుతూ విధినిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని, హెల్ఫ్ లైన్ ల ద్వారా అందే కాల్స్ కు మెరుపు వేగంతో స్పందించి రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారిని రక్షించాలని, హైవేల మీద, డాబా హోటల్స్ వద్ద
ఎట్టి పరిస్థితులలో వాహనాలు రోడ్డు మీద పార్కింగ్ చేయరాదని, అలా పార్కింగ్ చేయబడిన వాహనాలను ఆ పరిధిలోని యస్.ఐ ల సహకారంతో వెంటనే సీజ్ చేయాలని, హైవే పరిధికి లోబడి మాత్రమే విధులు ఎల్లవేళలా నిర్వహించాలని, లోకల్ పోలీసు అధికారులు చెప్పారని హైవే వదిలి ఎట్టి పరిస్థితులలో వెళ్లకూడదని హెచ్చరించారు. హైవే మీద రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు కిడ్నాప్ లు, దొంగతనాలు మరియు ఇతర నేరాలు జరిగినపుడు మొబైల్ పార్టీలు అన్నీ కూడా కంట్రోల్ రూం ఆదేశాలను అనుసరించి సమన్వయంతో పనిచేయాలని, అందరూ కాల్ సైన్ కు సత్వరం స్పందించాలని, వారి వారి పరిధిలలో మొబైల్ విజిబులిటీ
గణనీయంగా పెంచాలని, అన్నీ మొబైల్స్ కదలికలను ఎప్పటికప్పుడు జిపిఎస్‌ ద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, విధులలో నిర్లక్ష్యం వహించనా, నిజాయితీని విస్మరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా యస్పి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యస్పితో పాటు డియస్పి(ఏ.ఆర్) వై.రవీంద్ర రెడ్డి, ఆర్‌ఐ-వెల్ఫేర్ చంద్ర మోహన్, ఎమ్‌టిఓ గోపి సిబ్బంది పాల్గొన్నారు.

Post a comment

[blogger]

MKRdezign

Contact form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget